అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనవరాలు నవోమీ బైడెన్ వివాహం ఘనంగా జరిగింది. వైట్‌హౌస్‌లోని సౌత్ లాన్‌లో బైడెన్ తన మనవరాలి వివాహ వేడుకను నిర్వహించినట్టు పీపుల్ మేగజైన్ వెల్లడించింది. వధువు నవోమీ బైడెన్ గ్రాండ్ పేరెంట్స్ జో బైడెన్, జిల్ బైడెన్, వారి బంధువలు, మిత్రులు, ఇతర ప్రముఖుల సమక్షంలో వధూవరులిద్దరూ ఒక్కటయ్యారు.
వధువు నవోమీ బైడెన్, వరుడు పీటర్ నీల్‌ల ఎంగేజ్‌మెంట్ 2021లో జరిగింది. ఈ విషయాన్ని వారు ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ద్వారా వెల్లడించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో తామిద్దరం వివాహం చేసుకోబోతున్నామని ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించారు. గత దశాబ్దకాలంలో వైట్‌హౌస్‌లో వివాహ వేడుక జరగడం ఇదే తొలిసారి అని పీపుల్ మేగజైన్ వెల్లడించింది. అమెరికా అధ్యక్ష భవనంలో అధ్యక్షుడి మనవరాలి వివాహం జరగడం కూడా ఇదే తొలిసారి అని పేర్కొంది. ఈ వివాహ వేడుకలో వధువు నవోమీ.. తన తల్లి తరఫు వారి సంప్రదాయం ప్రకారం.. తెల్లటి లిల్లీ పూలతో వేదిక మీదకు వచ్చింది. నవోమీ బైడెన్ (28) కొలంబియా యూనివర్సిటీలో లా డిగ్రీ పూర్తిచేసింది. వరుడు పీటర్ నీల్ లా డిగ్రీ పూర్తిచేశాడు.
Congratulations Naomi and Peter! We love you. pic.twitter.com/aIEatnDQhm
— Jill Biden (@FLOTUS) November 19, 2022