మామూలుగా కొత్త బైక్ గానీ, కారు గానీ కొంటె దానికి ఫ్యాన్సీ నెంబర్ ఉండాలని కొందరు భావిస్తుంటారు. ఎందుకుంటే కొన్ని కొన్ని సార్లు ప్రత్యేకమైన ఫ్యాన్సీ నెంబర్లు వారి లెవల్‌ను పెంచాయని భావించేవారు చాలా మందే ఉన్నారు. అలా లక్షలు పోసి ఫ్యాన్సీ నెంబర్లు సొంతం చేసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం గురువారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల ప్రాథమిక రుసుమును భారీగా పెంచుతూ నిర్ణయించింది ఏపీ రవాణా శాఖ.
ప్రస్తుతం వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు రూ.5 చెల్లించి వేలంలో పాల్గొనవచ్చు. అయితే తాజాగా ఈ రుసుమును రూ.2 లక్షలకు పెంచుతూ ఏపీ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మోటారు వాహనాల చట్టానికి సవరణను చేస్తూ ఏపీ రవాణా శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రవాణా శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ఫ్యాన్సీ నెంబర్లు కావాలనుకునే వారు రూ.5 వేలకు బదులుగా రూ.2 లక్షలను ప్రాథమిక రుసుముగా చెల్లించాల్సి ఉంటుందని ఏపీ రవాణా శాఖ పేర్కొంది.