పూజా హెగ్దేకు ఇండిగో విమానంలో చేదు అనుభవం.. ఇదేం కొత్తకాదంటున్న నెటిజన్లు..

ట్విట్ట‌ర్ వేదిక‌గా టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ పూజా హెగ్డే గురువారం త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాన్ని పంచుకున్నారు. ఇండిగో విమాన‌యాన సంస్థ‌కు చెందిన ఓ ఉద్యోగి త‌మ ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించాడంటూ బుట్టబొమ్మ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సాధార‌ణంగా ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌ల‌ను తాను బ‌య‌ట‌కు చెప్పన‌ని, అయితే భ‌యంకర‌మైన ఈ ఘ‌ట‌న‌ను వెల్ల‌డించ‌డ‌మే మేల‌ని భావించాన‌ని స‌ద‌రు ట్వీట్‌లో పూజ తెలిపారు. ముంబై నుంచి బ‌య‌లుదేరిన ఇండిగో విమానంలో త‌న సన్నిహితుల‌తో కలిసి ప్రయాణించానని వివ‌రించిన పూజా… ఇండిగో ఉద్యోగి విపుల్ న‌కాశే త‌మ ప‌ట్ల దురుసుగా, అమర్యాదకరంగా వ్య‌వ‌హ‌రించాడ‌ని తెలిపారు.

Pooja Hedge shares about her bitter experience with Indigo staffer on Twitter

అకార‌ణంగానే, త‌మ‌తో అత‌డు అహంకారం, అజ్ఞానంతో ప్రవర్తించి బెదిరింపు స్వరంతో విరుచుకుపడ్డాడని పూజ ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ఇండిగో సంస్థకు ఇదేం కొత్తకాదని.. ఇదివరకు కూడా ఇండిగో విమానయాన ఉద్యోగుల ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించినట్లు ఇండిగో బాధితులు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా ఇండిగో ఫ్లైట్‌లో ఇచ్చిన ఫుడ్‌ కూడా బాగోలేదని దానికి సంబంధించిన ఫోటోలు పంచుకుంటున్నారు.