సోము వీర్రాజుకు వెల్లంపల్లి వార్నింగ్… రెచ్చకొడితే ఊరుకోం !

అమరావతి : సోము వీర్రాజు కు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వార్నింగ్‌ ఇచ్చారు. ఏపీలో మళ్ళీ కరోనా రావాలని సోము వీర్రాజు కోరుకుంటున్నాడని ఫైర్‌ అయ్యారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేంద్ర మార్గదర్శకాల ప్రకారం సోము పై కూడా కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీలో మత విధ్వేశాలు రెచ్చగొడితే.. చూస్తు ఊరుకోబోమని తెలిపారు.

ధర్నా పేరుతో సోము వీర్రాజు డ్రామా ఆడుతున్నారని… బీజేపీకి కనీసం కార్పొరేటర్ స్థాయిలో కూడా నాయకులు లేరని మండిపడ్డారు. వినాయక చవితి చేసుకోవద్దన్నద్దని ప్రభుత్వం చెప్పలేదు…ప్రజల ప్రాణాలు కూడా ప్రభుత్వానికి ముఖ్యమన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని… ఆగష్టు 28న కేంద్ర హోమ్ శాఖ సీఎస్‌కు ఉత్సవాలు చేయవద్దని మార్గదర్శకాలు పంపించిందని గుర్తు చేశారు. సోము వీర్రాజు కు దమ్ము ధైర్యం ఉంటే కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను మార్చాలని సవాల్‌ విసిరారు. కుంభమేళకు ఏ స్థాయి విమర్శలు వచ్చాయి… నిర్వహించింది ఎవరు ? అని బీజేపీకి చురకలు అంటించారు.