ఇవాళ భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ కీలక సమావేశానికి… ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇతర కీలక నేతలు అందరూ హాజరయ్యారు. అయితే ఈ పార్లమెంటరీ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక పై కీలక చర్చ జరిగినట్లు సమాచారం అందుతోంది.
అంతేకాదు వచ్చే రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపి పార్టీ తరఫున ప్రస్తుత ఉపరాష్ట్రపతి, ముప్పవరపు వెంకయ్య నాయుడు ను నిలబెట్టాలని యోచిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పార్లమెంటరీ సమావేశం లో ఆయన పేరును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.
త్వరలో నే దీని పై అధికారిక ప్రకటన కూడా రానుంది. అలాగే సామాజిక న్యాయం పై దేశ వ్యాప్తంగా బిజెపి సమావేశాలు, సదస్సులు నిర్వహించాలని బీజేపీ పార్లమెంటరీ సమావేశం లో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం ఏప్రిల్ ఆరో తేదీ నుంచి 14వ తేదీ వరకు బిజెపి సమావేశాలు మరియు సదస్సును నిర్వహించనుంది.