ఎఫ్ 3: రేచీకటితో నవ్వించనున్న వెంకటేష్..

-

దర్శకుడు అనిల్ రావిపూడి తన హీరోల పాత్రలని చాలా వైవిధ్యంగా తీర్చిదిద్దితాడు. పాత్ర పోషణతో నవ్వు తెప్పించే ప్రయత్నం చేస్తాడు. అవి ప్రేక్షకులకి నచ్చుతాయి కూడా. ఇప్పటివరకు అనిల్ చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఎఫ్ 3 తో ముందుకు వస్తున్న అనిల్ రావిపూడి, ఈ సారి వెంకటేష్ తో సరికొత్తగా నవ్వించనున్నాడట. ఈ సినిమాలో వెంకటేష్ కి రేచీకటి అని సమాచారం.

రాత్రిపూట కళ్ళు కనబడవట. అయినా సరే అందులోంచే నవ్వులు పూయిస్తాడట వెంకటేష్. రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజని అంధుడిగా చూపించి మాస్ ప్రేక్షకులని ఎంతగా మెప్పించాడో తెలిసిందే. ఈ సారి వెంకటేష్ చేత అలాగే నవ్వుల పువ్వులు పండించనున్నాడట. ఎఫ్ 2 భార్యా భర్తల మధ్య తిరిగితే, ఎఫ్ 3 సినిమా డబ్బు చుట్టూ తిరుగుతుంది. మరి డబ్బు చుట్టూ తిరిగే కథలో ఎంత ఫన్ ఉండనుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news