అదిరి పోయే కథ తో వెంకటేశ్ ల్యాండ్ మార్క్ సినిమా.!

-

సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్  ది ఒక ప్రత్యేక స్థానం. తన సినిమాలు అన్నీ మినిమం గ్యారెంటీ గా ఉంటాయి. ఇక తాను హీరో అన్న మాటే గాని అయన చాలా సింపుల్ బిహేవియర్ కలిగి ఉంటారు. ఆయన తో మాట్లాడితే ఆధ్యాత్మిక గురువు లా మారి మన మనసు ను ఆహ్లాకరమైన స్థానం గా మారుస్తారు. సీనియర్ హీరోలలో హీరోయిజం పాత్రలు వదిలి పెట్టిన వారిలో మొదటి హీరో వెంకటేష్..

ప్రస్తుతం కథ డిమాండ్ ప్రకారం సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ వెళుతున్న వెంకటేష్ తాజాగా తన 75వ మూవీని `హిట్` సిరీస్ ల ఫేమ్ శైలేష్ కొలనుతో చేయడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా `హిట్ 2` తో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న శైలేష్ కొలను హీరో విక్టరీ వెంకటేష్ తో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ కు శ్రీకారం చుట్టబోతున్నారట. వెంకీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ వుంటుందని రీసెంట్ గా కథ విన్న వెంకటేష్ సురేష్ బాబు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ త్వరలో ప్రారంభిం కానున్న ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలిసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా బావిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. ఈ సినిమాను నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పై  అత్యంత భారీ స్థాయిలో  వెంకటేశ్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news