చలికాలంలో మనకి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చలికాలంలో దగ్గు, జలుబు మొదలు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు మనం ఆహార విషయంలో మార్పులు చేసుకుంటూ ఉండాలి. ఈ ఆహార పదార్థాలను కనుక డైట్ లో చేర్చుకుంటే ఖచ్చితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పైగా అనారోగ్య సమస్యలు ఏమి వుండవు. మరి ఎటువంటి ఆహార పదార్థాలను డైట్లో తీసుకుని చలికాలంలో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలి అనే విషయాన్ని చూద్దాం.
బెల్లం, నెయ్యి:
బెల్లం, నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. చలికాలంలో వీటిని తీసుకుంటే సైనస్ జలుబు వంటి ఇబ్బందులు రావు కాబట్టి మీరు మీ వంటల్లో బెల్లాన్ని నెయ్యిని వాడండి.
ఉలవలు:
ఉలవలు కూడా ఆరోగ్యానికి మంచిది మీరు చలికాలంలో ఉలవలను తీసుకుంటే ఆరోగ్య బాగుంటుంది. చర్మానికి కూడా ఇది చక్కటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కిడ్నీ స్టోన్స్ సమస్య రాకుండా కూడా చూసుకుంటుంది.
సజ్జలు:
సజ్జలు కూడా ఆరోగ్యానికి మంచిది. ఇందులో మినరల్స్, ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి సజ్జలు తీసుకుంటే కూడా చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలకి దూరంగా ఉండచ్చు.
నువ్వులు:
నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. మీ వంటల్లో నువ్వులని చేర్చుకోవడం వలన చలికాలంలో వచ్చే సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
వెన్న:
వెన్న జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చూస్తుంది వెన్నని కూడా మీరు మీ డైట్ లో చేర్చుకుంటూ ఉండండి దానితో చలికాలంలో వచ్చే సమస్యలకు దూరంగా ఉండొచ్చు.