అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న రాంచరణ్.. ప్రధాని మోదీతో స్టేజ్ పంచుకోనున్న హీరో..

-

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు గోల్డెన్ ఎరా నడుస్తున్నారని చెప్పవచ్చు.. ఇప్పటికే ఆయన నటించిన ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి హిట్అప్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఈయన తాజాగా ఓ అర్ధమైన గౌరవాన్ని దక్కించుకున్నారని సమాచారం.

 

డిసెంబర్ 14వ తేదీన గుజరాత్లోని అహ్మదాబాద్ లో జరగనున్న ప్రముఖ స్వామి మహారాజ్ జన్మ శతాబ్ది ఉత్సవాల్లో రామ్ చరణ్ ప్రధాని మోదీతో వేదికను పంచుకోవడానికి సిద్ధమయ్యారు.. ఈ కార్యక్రమానికి మోడీతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎందరో ప్రముఖులు వస్తూ ఉండగా టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ కు మాత్రమే ఆహ్వానం అందిందని తెలుస్తోంది అయితే రామ్ చరణ్ లో ఉన్న భక్తి భావాలు ఆధ్యాత్మిక భావన ఎందుకు దోహదం చేశాయని చెప్పవచ్చు దీనికి సంబంధించిన ఫోటోలు చెర్రీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఈ కార్యక్రమానికి నరేంద్ర మోడీ వస్తారని ప్రధాని కార్యాలయం స్పష్టం చేసిన వెంటనే రామ్ చరణ్ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందిందని తెలుస్తుంది.. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లోని ఒగనాజ్‌లో ప్రముఖ్‌ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవానికి సన్నాహాలు పూర్తయ్యాయి. పీఎస్‌ఎమ్‌ 100 పేరుతో నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు దేశ, విదేశాల నుండి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. BAPS అధినేత మహంత్ స్వామి సమక్షంలో డిసెంబర్ 14న సాయంత్రం ఐదు గంటలకు ఈ ఉత్సవాలు ప్రారంభం అవనునన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా ముకేశ్ అంబానీ వంటి ఎందరో ప్రముఖులు ఈ కార్యక్రమానికి రానున్నారని తెలుస్తోంది.. అలాగే ఇంద్ర ప్రముఖులు పాల్గొంటూనే కార్యక్రమానికి తెలుగు నుంచి రామ్ చరణ్ కు మాత్రమే ఆహ్వానం అందిందని సమాచారం..

Read more RELATED
Recommended to you

Latest news