నెట్​ఫ్లిక్స్​పై వెంకటేశ్ ఫైర్.. నాతో జోక్స్ వద్దంటూ వార్నింగ్

-

విక్టరీ వెంకటేశ్​​​​ నెట్​ఫ్లిక్స్​పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఏకంగా గన్ చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ వెంకీకి కోపం తెచ్చేలా నెట్​ఫ్లిక్స్ ఏం చేసింది..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

విక్టరీ వెంకటేశ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తోన్న వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’. సుపర్ణ్‌ వర్మ, కరణ్‌ అన్షుమాన్‌ ఈ సిరీస్​ను డైరెక్ట్‌ చేస్తున్నారు. అమెరికన్‌ క్రైమ్‌ డ్రామా సిరీస్‌ ‘రే డొనవన్‌’కు రీమేక్‌గా ఈ సినిమా​ తెరకెక్కుతోంది. ఈ వెబ్‌సిరీస్‌ నెట్​ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ప్రచారంలో భాగంగా వెంకీ ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.

ఈ వీడియోలో వెంకీ.. చేతిలో గన్​ పట్టుకొని నెట్​ఫ్లిక్స్​ను బెదిరిస్తున్నట్లు కనిపించారు. ‘పెద్ద తప్పు చేయొద్దు నెట్​ఫ్లిక్స్​.. హీరో ఎవరు?.. నేను, స్టార్​ ఎవరు?.. నేను, కిరాక్​గా కనిపించేది ఎవరు?.. నేను, ఫ్యాన్స్ ఎవరు?.. నా వాళ్లే. సో.. షో పేరు కూడా నాదే ఉండాలి. ‘రానా నాయుడు’ కాదు ‘నాగా నాయుడు’ అని ఉండాలని వార్నింగ్​ ఇచ్చాడు. “మజాక్​ మజాక్​ మే అబ్దుల్​ రజాక్​ హో జాతా” అంటూ గన్​ను టేబుల్​పై విసిరేసి భయపెట్టించే పని చేశారు విక్టరీ వెంకటేశ్​​​.’ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news