అస్సలు తగ్గేదెలే : “మా” ప్యానల్ ప్రకటించిన మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్ అసోసయేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సభ్యులు దూకుడు పెంచారు. ఇప్పటి వరకు మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకాష్ రాజ్, సివీఎల్ నరసింహారావు, మంచు విష్ణు ప్రకటించారు. అయితే వీరిలో ప్రకాష్ రాజ్ మాత్రమే ప్యానల్ ను ప్రకటించారు. అయితే తాజాగా హీరో మంచు విష్ణు కాసేపటి క్రితమే తన ప్యానల్ సభ్యులను ప్రకటించారు. ఇక ప్యానల్ సభ్యుల వివరాల్లోకి వెళితే.. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మంచు విష్ణు, జనరల్ సెక్రటరీ గా రఘుబాబు పేర్లను ప్రకటించారు.

అలాగే వైస్ ప్రెసిడెంట్ లు గా మాదాల రవి, పృథ్వీరాజ్ లను ప్రకటించారు మంచు విష్ణు. ఇక ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బిజెపి నేత బాబు మోహన్ ను ప్రకటించారు. జాయింట్ సెక్రటరీ గా కరాటే కళ్యాణి మరియు గౌతమ్ రాజు పేర్లను ప్రకటించగా… శివాజీ బాలాజీ ని ట్రెజరర్ గా ప్రకటించారు. ఇక ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా… అర్చన, అశోక్ కుమార్, గీతాసింగ్, హరినాథ్ బాబు, జయవాణి, మలక్పేట శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరి రెడ్డి, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివ నారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు, స్వప్నమాధురి, విష్ణు గోపన్న, మరియు వడ్లపట్ల పేర్లను ఫైనల్ చేశారు మంచు విష్ణు. కాగా మా అసోసియేషన్ ఎన్నికలు అక్టోబర్ 10 వ తారీఖున జరగనున్న సంగతి విధితమే.