Venky Re Release : థియేటర్స్‌లో ‘వెంకీ’ రీ రిలీజ్ హంగామా……

-

ఇటీవల కాలంలో గతంలో సూపర్ హిట్ సాధించిన చిత్రాలను మళ్లీ థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమా రీ రిలీజ్ అయితే థియోటర్ లలో సందడి చేస్తున్నారు. తాజాగా రవితేజ ,స్నేహ ప్రధాన పాత్రలలో నటించిన వెంకీ చిత్రం డిసెంబర్ 30న రీ రిలీజ్ అయినది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీనువైట్ల తెరకెక్కించారు. వెంకీ సినిమాలోని కామెడీ, సాంగ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి . వెంకీ సినిమా ఫస్ట్ ఆఫ్ లో హీరో రవితేజ ,అతని గ్యాంగ్, బ్రహ్మానందం మధ్య జరిగే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఈ చిత్రంలోని సీన్లను మీమర్స్ సోషల్ మీడియా కి సంబంధించిన ప్లాట్ఫారం లో ఎక్కువగా వాడుతున్నారు. ఇక మీమర్స్ అంతా బ్రహ్మానందంని దేవుని లాగా చూస్తారు. ఈ చిత్రం నుంచి బ్రహ్మీ టెంప్లేట్ లు అధికంగా ఉండడంతో ఈ చిత్రం మీమర్స్ కి చాలా స్పెషల్.

దీంతో వెంకీ చిత్రం రీ రిలీజ్ కి హీరో రవితేజ అభిమానులతో పాటు బ్రహ్మానందం అభిమానులు, మీమర్స్ థియేటర్లకి కి వచ్చి సందడి చేస్తున్నారు. హీరోల ఎంట్రీ కంటే బ్రహ్మానందం ఎంట్రీ కి ఫ్యాన్స్ పేపర్లు విసిరి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం రీ రిలీజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news