‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి వేణు తొట్టెంపూడి లుక్‌ రిలీజ్‌

-

మాస్‌ మహారాజ రవితేజ హీరో నటిస్తున్న కొత్త సినిమా రామారావు ఆన్‌ డ్యూటీ. అయితే ఈ సినిమాను నూతన దర్శకుడు శరత్‌ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను చెరుకూరి-రవితేజ సంయుక్తంగా నిర్మిస్తుండగా సామ్‌ సీఎస్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో.. వేణు తొట్టెంపూడి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్టుగా చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆ పాత్ర ఏమిటనేది మాత్రం బయటికి రాలేదు. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రను చేసినట్టుగా చెబుతూ.. సీఐ మురళి పాత్రలో ఆయన లుక్ ను పరిచయం చేస్తూ మేకర్స్ కొంతసేపటి క్రితం ఒక పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్‌.

కొంతకాలం క్రితం హీరోగా మంచి పేరు తెచ్చుకున్న వేణు, సినిమాలను పక్కన పెట్టేసి చాలా కాలమైంది. ఆ మధ్య ఎన్టీఆర్‌ నటించిన దమ్ము సినిమాలో నటించారు. ఈ సినిమాతో ఆయన రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. దివ్యాన్ష కౌషిక్ .. రజీషా విజయన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, అన్వేషి ఐటమ్ సాంగులో అలరించనుంది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news