ఏపీ సీఎం కాదు… అమెరికా అధ్యక్షుడు అవ్వు – లోకేష్ పై వర్మ కౌంటర్

-

ఈనెల 27 నుంచి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రేపు ఉదయం 11 గంటలకు నారా లోకేష్ పాదయాత్ర ని ప్రారంభించనున్నారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ పాదయాత్ర పై విమర్శలు సంధించారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ పాదయాత్ర పై స్పందిస్తూ.. ” సార్ నారా లోకేష్ గారు.. మీరు ఈ పాదయాత్రతో ఆంధ్ర ప్రదేశ్ సీఎం మాత్రమే కాకుండా, ఇండియన్ ప్రధానమంత్రి, అమెరికన్ ప్రెసిడెంట్ కూడా అవ్వాలని ఆ ముక్కోటి దేవతలని ప్రార్థిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ఈట్వీట్ కి తన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలోని “పప్పు లాంటి అబ్బాయి” పాటని కూడా జత చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news