ఢిల్లీకి రాజైనా.. తల్లికి కొడుకే అన్నట్లు తాను పీసీసీ అధ్యక్షుడినైనా మీ వాడినేనని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కొడంగల్ ప్రజలతో ఆయన మాట్లాడుతూ.. గతంలో మీరు ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసానని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ పేదవాడికి అన్నిరకాల సహాయం అందించిందన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లయినా పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు.
కేసీఆర్ ఇచ్చిన మాట ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. పంట బీమా ఇవ్వకుండా… రైతు చనిపోతే డబ్బులిస్తాడట అంటూ దుయ్యబట్టారు. ధరణి దరిద్రం పోవాలంటే కేసీఆర్ ఉద్యోగం పోవాల్సిందేనన్నారు రేవంత్ రెడ్డి. షాది ముబారక్ , కల్యాణ లక్ష్మీ కేసీఆర్ పోయినా ఆగదన్నారు. అంతకు అంతకు కలిపి ఆ కళ్యాణ లక్ష్మీ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా పెన్షన్ ఆగదని అన్నారు.