కృష్ణా నదికి వరదలు వస్తుంటే చాలు ఇప్పుడు అక్కడి ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. వరదల తీవ్రతతో ఒక విధంగా భయపడుతుంటే అక్కడి పాముల తీవ్రతకు మరో విధంగా భయపడుతున్నారు. పై నుంచి భారీగా వరదలు వస్తున్నాయి. దీనితో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న అడవుల నుంచి వచ్చి కలుస్తున్నాయి విష పూరిత పాములు. ఈ క్రమంలోనే ఒక ఘటన జరిగింది.
ఘంటసాల మండలం లో పాము కాట్ల కలకలం రేగింది. ముగ్గురు చిన్నారులను కట్లపాము కాటు వేసింది. పాపవినాశనం గ్రామానికి చెందిన ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలను కట్ల పాము కాటు వేసింది. పాము కాటు కు గురైన చిన్నారుల పేర్లు కుమ్మరి సిరిప్రవీణ(10), ప్రజ్వల్(7), ప్రణీత్(8) వెంటనే వారిని మొవ్వ పీహెచ్‌సీ కి అత్యవసర చికిత్సలు తరలించారు. వైద్య చికిత్స అందిస్తున్న వైద్యులు… ఎలాంటి అపాయం లేదని చెప్పారు.