ఎన్టీఆర్ గారి ఇంట్లోకి వెళ్ళే చనువు చలపతి రావు గారికే ఉండేది..!!

-

టాలీవుడ్ లో వరసగా మరణాలు సంభవిస్తున్నాయి . కృష్ణం రాజు , కృష్ణ, కైకాల వరుసగాఈ లోకాన్ని వదిలి వెళ్ళగా.. ఆని బాధ నుంచి కోలుకోకముందే.. టాలీవుడ్ సీనియర్ నటులు చలపతిరావు కన్ను మూశారు. దాదాపుగా 1200 సినిమాల్లో నటించారు చలపతిరావు మూడు తరాల నటులతో కలిసి నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఇంట్లోకి అడక్కుండా వెళ్లి భోజనం చేయగలిగిన చనువు చలపతి రావు గారికి ఉండేది.

ఎన్టీఆర్ గారు చలపతి రావు గారిని ముద్దుగా చలపాయి అని పిలుచుకునే వారు. సినిమా పరిశ్రమ లోకి రావడానికి కూడా అన్న గారు వెళ్లి పోమని చెప్పినా మొండిగా ప్రతి రోజు ఉదయం పూట 6గంటలకు వెళ్లి కనపడే వారు. ఇక వీడితో లాభం లేదనుకుని తనే తాను సినిమా షూటింగ్ దగ్గరకు తీసుకొని వెళ్ళడం చేశారట. అక్కడి నుండి అన్నగారు ఎక్కడ ఉంటే అక్కడ చలపతి రావు గారు ఉండేవారట.

ఇక ఎన్టీఆర్ సినిమా అంటే చాలు వేరే సినిమా డేట్స్ కాన్సిల్ చేసి మరీ షూటింగు కు హాజరు అయ్యేవారట. ఇక తాను తన రెమ్యూనరేషన్ కూడా మొత్తం తీసుకోకుండా కొద్దిగా మాత్రమే ఖర్చులకు తీసుకొని మిగిలిన డబ్బులు అన్నగారి దగ్గరే వుంచి పొదుపు చేసుకొనే వారట. ఇలాంటి అనుబందం వారి మధ్య మాత్రమే చూడగలం అని అప్పటి సీనియర్ ఆర్టిస్ట్ లు గుర్తు చేసుకొనే వారు.

 

Read more RELATED
Recommended to you

Latest news