Big Boss Non Stop: అషురెడ్డిపై కంటెస్టెంట్స్ అసంతృప్తి..కేప్టెన్సీ గేమ్ వెరీ ఇంట్రెస్టింగ్

-

బిగ్ బాస్ ఓటీటీ షో ఏడో వారంలో కంటెస్టెంట్స్ గేమ్ పైన బాగా కాన్సంట్రేట్ చేస్తున్నారు. కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచేందుకు ‘బిగ్ బాస్’ కొత్త టాస్కు ఇచ్చారు. ‘గ్రాబ్ ద ఫ్లాగ్’ అనే టాస్క్ ఇచ్చిన క్రమంలో కంటెస్టెంట్స్ సత్తా చాటే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే సంచాలక్‌గా ఉన్న అషురెడ్డి పై కంటెస్టెంట్స్ అసంతృప్తితో ఉన్నారు.

కంటెస్టెంట్స్ లో కొందరు సంచాలక్ గా వ్యవహరిస్తున్న అషురెడ్డి నిర్ణయాలను తప్పుబడుతున్నారు. ఇటీవల కాలంలో హమీద, అనిల్ ను రూల్స్ పక్కనబెట్టి మరీ డిస్ క్వాలిఫై చేసింది. దాంతో హమీద, అనిల్ అషురెడ్డి నిర్ణయంపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక గురువారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అందరు కూడా చాలా సీరియస్ గా గేమ్ ఆడారు. చాలా కాలం నుంచి కేప్టెన్సీ పైన ఆశలు పెట్టుకున్న శివ.. ఈసారి తన కలను నెరవేర్చుకున్నాడు.

చివరి వరకు కెప్టెన్ ఎవరు అవుతారనే ఉత్కంఠ బిగ్ బాస్ లో కొనసాగిందని చెప్పొచ్చు. కంటెస్టెంట్స్ లో కొందరు బిగ్ బాస్ కేప్టెన్సీ పోటీదారులుగా ఉంటారన్న సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే రాక్ అండ్ రోల్ టాస్క్ రాగా, అక్కడ కంటెస్టెంట్స్ ఎవరికి వారుగా ఎత్తుగడలతో ముందుకెళ్లినట్లు అనిపిస్తుంది.

చివరి క్షణం వరకు కేప్టెన్సీ సాధించేది ఎవరా?అన్న ప్రశ్న అయితే తలెత్తింది. మహేశ్ రాక్ అండ్ రోల్ లో చివరకు చేయి కదపగా కెప్టెన్ ఈజ్ శివ అని బిందు మాధవి అనౌన్స్ చేసింది. శివ కెప్టెన్సీలో గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా సాగబోతున్నదని
అర్థమవుతోంది..చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Latest news