తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని.. అందుకే సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ కౌంటర్ ఇచ్చారు. నిరోద్యోగులు వ్యతిరేకత తోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉద్యోగ ప్రకటన చేసాడని.. ఉద్యోగ ప్రకటనను స్వాగతిస్తున్నాము కానీ ఉద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అందరి త్యాగాల ఫలమే తెలంగాణ రాష్ట్రమని.. ST, SC, BC లకి కాంగ్రెస్ ఎన్నో ఏళ్ల నుండి పోరాడితేనే 49 సంవత్సరాల వయో పరితిని పెంచిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరోద్యోగ భృతి ఇవ్వాలని.. ఆర్టికల్ 3 వలన తెలంగాణ వచ్చిందని వెల్లడించారు. పంజాగుట్ట లో dr.అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చెయ్యలని వీ హనుమంతరావు డిమాండ్ చేశారు.
ఉద్యోగల కోసం చనిపోయిన కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని.. నిరోద్యోగ భృతి క్రింద 3000 ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి ఉద్యోగ క్యాలెండర్ ఏడాది ఆలస్యం గా ఉందని.. 23 జిల్లాలు అదనంగా ఏర్పాటు చేశారు..అదనపు ఉద్యోగాలు రావాలన్నారు. శాఖలు కుదించి ఉద్యోగ నియామకాలు చేస్తున్నారు.. రాష్ట్రం ఏర్పడ్డాక ఉన్న ఖాళీలు, ఉద్యోగ విరమణ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తున్నారని మండిపడ్డారు.