వెంకటేష్ ఎన్నాళ్ళకు హిట్ దర్శకులతో.!

-

సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్  ది ఒక ప్రత్యేక స్థానం. తన సినిమాలు అన్నీ మినిమం గ్యారెంటీ గా ఉంటాయి. ఇక తాను హీరో అన్న మాటే గాని అయన చాలా సింపుల్ బిహేవియర్ కలిగి ఉంటారు. ఆయన తో మాట్లాడితే ఆధ్యాత్మిక గురువు లా మారి మన మనసు ను ఆహ్లాకరమైన స్థానం గా మారుస్తారు. సీనియర్ హీరోలలో హీరోయిజం పాత్రలు వదిలి పెట్టిన వారిలో మొదటి హీరో వెంకటేష్.

ప్రస్తుతం కథ డిమాండ్ ప్రకారం సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ వెళుతున్న వెంకటేష్ తాజాగా తన 75వ మూవీని `హిట్` సిరీస్ ల ఫేమ్ శైలేష్ కొలనుతో చేయడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా `హిట్ 2` తో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న శైలేష్ కొలను హీరో విక్టరీ వెంకటేష్ తో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ కు శ్రీకారం చుట్టబోతున్నారట. వెంకీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ వుంటుందని తెలుస్తోంది.

Venkatesh to team up with shekhar kammula

దీనితో పాటు ధమాకా సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఇటీవల 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకున్న  దర్శకుడు అయిన త్రినాధ రావు నక్కిన తో కూడా సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.ఇక త్రినాధరావుతో సినిమా చేసేందుకు చాలా మంది నిర్మాతలు అడ్వాన్స్ పట్టుకొని తిరుగుతున్నారని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అతనికి అడ్వాన్స్ ఇచ్చి మరి తదుపరి సినిమా తమ ప్రొడక్షన్లోనే చేయాలి అనే మాట తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డైరెక్టర్ ను వెంకటేష్ ను కలిపి సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news