రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తోంది – మహేష్ కుమార్ గౌడ్

-

రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తుందని మండిపడ్డారు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. సర్పంచుల సమస్యలపై ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ధర్నా చేసే హక్కు ప్రతిపక్షాలకు, వ్యక్తులకు ఉంటుందని.. కోర్టు ధర్నాకు అనుమతి ఇచ్చిందని అన్నారు.

73, 74 సవరణ చేసి గ్రామ పంచాయతీల బలోపేతం కోసం కాంగ్రెస్ కృషి చేసిందన్నారు. సర్పంచులను దొంగలుగా చూపించే ప్రయంతం కోసం కలెక్టర్ లను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకుల మాట వినకపోతే సస్పెండ్ చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం సస్పెండ్ 3 నెలలు మాత్రమే చేయాలి కానీ.. వారికి అనుకూలంగా సస్పెన్షన్ గడువు పోడగిస్తున్నరని ఆరోపించారు. డిజిటల్ కీ ద్వారా దొంగ చాటున నిధులు ఖాతాల నుంచి మళ్లించారని అన్నారు మహేష్ కుమార్.

ధర్నా కు అనుమతి ఇస్తే బండారం బయటపడుతుందని ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. కేసిఆర్ కుటుంబం జేబులు నింపేందుకు కాళేశ్వరం ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడలేదన్నారు. బీజేపీ – బీఆర్ఎస్ రెండు తోడు దొంగలని ఆరోపించారు.ఇద్దరు కలసి దోచుకుంటున్నారని అన్నారు. అద్వానీ సిద్దాంతాలు ఉన్న బీజేపీ సచ్చిపోయిందని.. కార్పొరేట్ సిద్ధాంతాల బీజేపీ నడుస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news