ఛీ..ఛీ..వీళ్ళు అస్సలు మనుషులేనా? కళ్ల ముందే దారుణం..

-

తన పిల్లలకు ఏదైనా కష్టం వస్తే తల్లి అర సెకను కూడా ఆగదు..అది మనిషైనా, జంతువులైన ఒకటే..తన ప్రాణాలను అడ్డు వేసి పిల్లల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది.ఓ తల్లి కుక్క తన పిల్లలు ప్రాణపాయంలో ఉండగా.. వాటిని రక్షించేందుకు ప్రయత్నించింది. కానీ, ఆ ప్రయత్నం విఫలమైంది. పాము కాటుకు మూడు కుక్క పిల్లలు బలయ్యాయి. తన పిల్లలను కాపాడుకునేందుకు ఆ తల్లి కుక్క ప్రయత్నిస్తుండగా.. పక్కనే నిల్చున్న కొందరు వ్యక్తులు మాత్రం మరీ రాక్షసంగా ప్రవర్తించారు. కనీస మానవత్వం చూపలేదు. పాము నుంచి ఆ పిల్లలను కాపాడాల్సింది పోయి.. కాటు వేస్తుంటే ఫోన్లలో వీడియో తీశారు.

ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లాలోని మంతటి గ్రామంలో చోటు చేసుకుంది.మనుషులను తీవ్రంగా కలచి వేస్తుంది.ఓ కుక్క ఇటీవల మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఓ బండ చాటున గూడు ఏర్పాటు చేసుకుని జీవిస్తోంది. ఇంతలో వచ్చిన నాగుపాము ఆ కుక్క పిల్లలపై దాడి చేసింది. ఆ పక్కనే ఉన్న తల్లి కుక్క.. పాముతో పోరాడింది. తన పిల్లలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ, దాని ప్రయత్న విఫలయత్నంగా మిగిలిపోయింది. పాము కాటుకు మూడు కుక్క పిల్లలు బలైపోయాయి. పాము విషం దాటికి ప్రాణాలు కొల్పొయాయి..

అక్కడే ఉన్న కొందరు మాత్రం పాము నుంచి ఆ కుక్క పిల్లలను రక్షించే ప్రయత్నం చేయకపోవడమే. అవును, పాము వచ్చే ఆ కుక్క పిల్లలపై దాడి చేస్తుంటే కొందరు వ్యక్తులు తమ ఫోన్లలో వీడియో చిత్రీకరించారు. మూడు కుక్క పిల్లలను చంపేంత వరకు అలాగే వీడియో తీసిన స్థానికులు.. ఆ తరువాత పాముపై దాడి చేసి చంపేశారు. కుక్క పిల్లలపై పాము అటాక్ చేయడానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆ వీడియో తీసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు..మీ పిల్లలకు అలాంటి పరిస్థితి వస్తే ఆగుతారా అంటూ ఫైర్ అవుతున్నారు..మొత్తానికి ఈ వీడియో వైరల్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news