ఒకప్పుడు బాలీవుడ్‌లో మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాలు చేస్తూ ఉన్న విద్యాబాలన్ డర్టీపిక్చర్ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా హాట్ హాట్ ఇమేజ్ తెచ్చుకుంది. ఆ ఒక్క సినిమాతో విద్యకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా అక్షయ్‌కుమార్ మిషన్‌మంగళ సినిమాలో నటించిన ఆమె రోల్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అదే టైంలో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి.
ఇక కాస్టింగ్ కౌచ్ బాధితుల్లో తాను కూడా ఉన్నానని తాజాగా విద్యాబాలన్ బాంబు పేల్చింది. గత రెండున్నరేళ్లుగా కాస్టింగ్ కౌచ్ గురించి ఎంతోమంది హీరోయిన్లు నోరెత్తుతున్నారు. ఎంతోమంది హీరోయిన్లు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎవరి చేతుల్లో లైంగీక దాడికి లేదా దోపిడీకి గురయ్యామో చెప్పేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇదే అంశంపై తాను ఎదుర్కొన్న ఇబ్బందిని విద్య చెప్పారు. ఓ దర్శకుడు తనను రూమ్‌కు రమన్నాడన్న ఆమె తన అనుభవం చెప్పుకొచ్చింది. సినిమా కాన్సెఫ్ట్ చెప్పే ఉద్దేశంతో రూమ్‌కు రమ్మన్నాడని.. అయితే తాను మాత్రం కాపీ షాప్‌లో కలవాలని అంటే అతడు మాత్రం పదే పదే రూమ్‌కు రావాలని చెప్పడంతో పాటు చాలా వెలికిగా మాట్లాడాడని చెప్పింది.
చివరకు అతడి ఉద్దేశం అర్థమై తాను బయటకు వెళ్లాలని చెప్పానని.. ఐదు నిమిషాల పాటు తనను ఎగాదిగా చూసి వెళ్లాడని ఆమె వాపోయింది. ఆమె ఆ డైరక్టర్ పేరు చెప్పకపోయినా అతడు సౌత్‌కు చెందినవాడని.. చెన్నైలో తనకు ఈ అనుభవం ఎదురైందని మాత్రం చెప్పింది.