సుక్కుతో విజయ్ క్రేజీ కాంబో..!

టాలీవుడ్ లో మ‌రో క్రేజీ కాంబినేష‌న్ కి రంగం సిద్ధం అయ్యింది. ఈ ఏడాది అత్యంత క్రేజీ కాంబోగా సుక్కు – విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల కాంబినేష‌న్ నిల‌వ‌బోతోంది. యువ‌ నిర్మాత కేదార్ సెల‌గ‌మ్ శెట్టి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని విజ‌య్ దేవ‌ర‌కొండ అధికారికంగా ప్ర‌క‌టించారు. కొత్త‌దనాన్ని ఇష్ట‌ప‌డే విజ‌య్‌, సుకుమార్ ల క‌ల‌యిక‌లో సినిమా అంటే ఊహీంచలేని అంచ‌నాలుంటాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గని స్థాయిలో ఈ సినిమా వుంటుంది` అన్నారు. 2022లో ఈ చిత్రాన్ని ప్రారంభించ‌బోతున్నారు.

ఈ ప్రాజెక్ట్ విష‌యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ సూప‌ర్ ఎక్సైటెడ్‌గా వున్నాడ‌ట‌. ఆడియ‌న్స్ సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటార‌ని, ఓ మెమొర‌బుల్ సినిమాని అందించ‌బోతున్నామ‌ని గ్యారెంటీ ఇస్తున్నాను. ప్ర‌స్తుతం `పుష్ఫ‌` సినిమాతో బిజీగా ఉన్నాడు సుకుమార్‌. 2021లో ఈ సినిమావ విడుద‌ల అవుతుంది. విజ‌య్ సినిమా 2022లో మొద‌ల‌వుతుంది. ఈ సినిమాపై మరిన్ని వివరాలు త్వరలో తెలియేస్తామన్నారు. ఈగ్యాప్‌లో సుకుమార్ మ‌రో సినిమా చేస్తాడా? లేదంటే విజ‌య్ కోసం ఎదురు చూస్తాడా? అన్న‌ది తేలాల్సివుంది.