త్వరలోనే దేవరకొండ, రష్మిక వివాహం..క్లారిటీ ఇదే !

-

ఆన్ స్క్రీన్ లవ్లీ ఫెయిర్ గా వివో హృదయాలను గెలుచుకున్నారు రష్మిక, విజయ్ దేవరకొండ. గీత గోవిందం సినిమా లో రష్మిక- విజయ్ దేవరకొండ ల మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అదే సమయంలో రష్మిక మందాన సైతం తన ప్రియుడు, కన్నడ నటుడు రోహిత్ శెట్టి తో నిశ్చితార్థాన్ని రద్దు చేసు కోవడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లయింది.

విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉండటంతోనే ఆమె రోహిత్ కు బ్రేకప్ చెప్పారని పలువురు అంటున్నారు కూడా. అయితే ఈ వార్తలపై వీరిద్దరు ఎప్పుడు కామెంట్ చేయలేదు. ఇదిలా ఉండగా…తాజాగా విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని.. వార్తలు రాశాయి కొన్ని మీడియా సంస్థలు.

అయితే.. వీటిపై తాజాగా విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతీసారి వార్తల్లో ఇదే చెత్తను చూడాల్సి వస్తోందని ట్విటర్‌ లో కాస్త బూతుపురాణంతోనే చిరాకు వ్యక్తం చేశాడు దేవరకొండ. తద్వారా అది ఒక ఫేక్‌ వార్త అని చెబూతనే.. మీడియాకు కౌంటర్‌ ఇచ్చారు. ఇక ఈ ట్వీట్‌ కు రష్మికు కూడా సపోర్ట్‌గా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news