విజయ్ దేవరకొండ హీరోగా.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. భారీ అంచనాల మధ్య ఆగస్టులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. విజయ్, పూరీ జగన్నాథ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇద్దామనుకున్న విజయ్‌కు , మంచి హిట్ కొట్టి పాన్ ఇండియా డైరెక్టర్ కావాలను కున్న పూరీ జగన్నాథ్ కు దెబ్బపడింది.
ఇక ఈ సినిమా నిర్మాత గా వ్యహరించిన ఛార్మి కౌర్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. వీరు ఏదో అనుకొని తీస్తే అది మరోలా రిజల్ట్ ఇచ్చింది. ఇక తర్వాత జరిగిన డిస్టి బ్యూటర్స్ రచ్చ , పూరీ జగన్నాథ్ ఒపెన్ లెటర్ రాయటం వంటి పెద్ద ఎపిసోడ్ నడిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ కొన్ని రోజుల పాటు ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక సమంత కు అనారోగ్యం తో ఉండటం వలన మళ్లీ ఖాళీ అయ్యాడు.
అయితే విజయ్ దేవరకొండ కు మన పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ సినిమా చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయం పై విజయ్ మాట్లాడుతూ.. “సుకుమార్‌తో సినిమా ఖచ్చితంగా ఉంది. ప్రస్తుతం సుకుమార్ గారు పుష్ప 2తో బిజీగా ఉన్నారు. పుష్ప 2 సినిమా అయిపోయిన తర్వాత మా సినిమా స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు. దీంతో సుకుమార్ అంటే హిట్ కొట్టడం గ్యారంటీ అని ఆనంద పడుతున్నారు.