ముగిసిన విజయ్ దేవరకొండ ఈడి విచారణ తన జీవితం లోనే ఇది ఒక అనుభవముని చెప్పుకొచ్చిన స్టార్ హీరో..

-

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండను విచారించింది.. దాదాపు 11 గంటల పాటు సాగిన ఈ విచారణ తన జీవితంలోనే మర్చిపోలేని సంఘటన అంటూ చెప్పుకొచ్చారు విజయ్..

 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమా పెట్టుబడుల విషయంలో నిర్మాతలు పలు వివాదాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ చిత్ర బృందం ఈ డి విచారణకు హాజరు కావలసి వచ్చింది.. ఇప్పటికే ఈ విషయంలో దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత చార్మిలను విచారించిన ఈడి తాజాగా హీరో విజయ్ దేవరకొండను 11 గంటల పాటు ప్రశ్నించింది..

ఈ నేపథ్యంలో విజయ్ ఈడీ విచారణలో సినిమాలో విజయ్ పెట్టుబడులపై అధికారులు ఆరా తీశారు. అలాగే ఆయన బ్యాంక్ అకౌంట్లపైనా వివరాలు అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. లైగర్ సినిమాకు విజయ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో కూడా ఆరా తీసింది. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద విజయ్ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు ఈడీ అధికారులు. అయితే విచారణ పూర్తయిన అనంతరం మీడియాతో మాట్లాడిన విజయ్ దేవరకొండ.. ఈడికి తాను పూర్తిస్థాయిలో సహకరించానని వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని తెలిపారు.. వాళ్లు రమ్మన్నారు.. తాను వెళ్లానని విజయ్ చెప్పారు. తన రెమ్యూనరేషన్ గురించి అడిగారని.. తన జీవితంలో ఇదో అనుభవమని రౌడీ స్టార్ పేర్కొన్నారు.. మళ్లీ విచారణ ఉండనుందా అనే ప్రశ్న రిపోర్టర్స్ అడగగా వారు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఈ విషయం కోసం అంటూ చెప్పుకు వచ్చారు..

పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం.. వంద కోట్లకుపైగానే బడ్జెట్‌ అయినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదలై పరాజయం చెందింది. డిజాస్టర్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే విదేశాల నుంచి ఈ సినిమాకి పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ గుర్తించిందని సమాచారం. అంతేకాదు పలువురు పొలిటికల్‌ లీడర్స్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేశారట. దానిపై ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ విచారించబోతుంది. ఆ నష్టాల వ్యవహారానికి సంబంధించిన లావాదేవీలను సైతం ఈడీ విచారిస్తుంది. `లైగర్‌`లో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించగా, బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేసింది. వరల్డ్ మాజీ బాక్సింగ్‌ ఛాంపియన్‌ మైఖేల్‌ టైసన్‌ ఇందులో కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం విజయ్‌ `ఖుషీ` చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news