రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను ఇంటర్నేషనల్ వైడ్‌గా ప్రమోట్ చేశాడు. దేశవిదేశాల్లో ఆర్ఆర్ఆర్‌ను తన స్టైల్లో ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. జపాన్‌లోనూ మన రాజమౌళి సత్తా చాటాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టీం ఆస్కార్ అవార్డ్ మీద కన్నేశాడు. హీరోతో సంబంధంలేకుండా కేవలం రాజమౌళి పేరుతోనే సినిమాకు వందల కోట్లల్లో బిజినెస్ జరుగుతుంది. ‘బాహుబలి’తో టాలీవుడ్ స్థాయిని పెంచిన రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’తో ఏకంగా ఇండియన్ సినిమా స్థాయిని పెంచాడు. ముఖ్యంగా హాలీవుడ్ సినీ ప్రముఖులు ఇండియన్ సినిమా గురించి గొప్పగా మాట్లాడుకునేలా చేశాడు. రాజమౌళి టేకింగ్‌కు, విజన్‌కు హాలీవుడ్ దర్శకులు, టెక్నీషియన్‌లు సైతం ఫిదా అయ్యారు.
ఈ సినిమాతో రాజమౌళి ఇప్పటికే ఎన్నో అవార్డులను సాధించాడు. కాగా తాజాగా ఈయన మరో ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నాడు. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్(NYFCC).. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళిని ఎంపిక చేసింది. ఈ అవార్డు సాధించిన తొలి భారతీయ దర్శకుడిగా రాజమౌళి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లీష్ సినిమాలతో పోటీ పడి ఒక టాలీవుడ్ సినిమా ఈ ఘనత సాధించిందంటే రాజమౌళి గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఇటీవలే లాస్ ఏంజిల్స్ టైమ్స్ అనే ఇంగ్లీష్ పేపర్ రాజమౌళి గురించి ఫ్రంట్ పేజ్‌లో ఓ పెద్ద ఆర్టికల్ ప్రచురించింది.