సమంత బాటలోనే విజయ్ దేవరకొండ.. కొత్త అవతారం..?

పెళ్లిచూపులు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ కి అర్జున్ రెడ్డి సినిమా తో ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో యూత్ ఐకాన్ గా కొనసాగుతున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ కేవలం టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరో గా నటించిన అర్జున్ రెడ్డి సినిమా హిందీ రీమేక్ కూడా మంచి విజయం సాధించింది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ త్వరలో కొత్త అవతారం ఎత్తపోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు చిరంజీవి నాగార్జున నాని లాంటి స్టార్ హీరోలు వ్యాఖ్యాతలుగా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేశారు ఇక ఇప్పుడు రౌడీ హీరో కూడా వీరి దారిలోనే వెళ్లబోతున్న తెలుస్తోంది. ఇండియాలోనే పాపులర్ హిప్-హాప్ డాన్సు షో అయినా షఫుల్ నాలుగో సీజన్ కి విజయ్ దేవరకొండ హోస్టింగ్ చేయబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తో కలిసి ఈ షోకి వ్యాఖ్యాతగా మారబోతున్నాడట విజయ్ దేవరకొండ. ఇక దీనికి సంబంధించిన ఒక పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.