యంగ్ హీరో విజయదేవర కొండ ఇండియా ఫిల్మ్ హిస్టరీ లో సూపర్ స్టార్ గా మారిపోయే అవకాశం కు లైగర్ దెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. దీనికి ప్రధాన కారణం పూరి జగన్నాథ్ కథ సరిగా లేకపోవటం మరియు విజయ్ బిహేవియర్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. విజయ్ యాటిట్యూడ్ నచ్చక చాలా మంది బాయ్ కాట్ లైగర్ కు మద్దతు ఇచ్చారు.
తర్వాత విజయ్ సమంత జోడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా కాశ్మీర్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చారు. కాని ప్రస్తుతం సమంత మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ వ్యాధి తో భాద పడుతున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు ఖుషి సినిమా షూటింగ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.
సమంత ఈ వ్యాధి నుండి బయట పడి ఆరోగ్యంగా వుండాలని జూ ఎన్టీఆర్, చిరంజీవి, అఖిల్ ట్వీట్స్ చేశారు. కాని ఈ వ్యాధి తగ్గాలంటే రెగ్యులర్ మెడిసిన్ తో పాటు చాలా రోజుల వరకు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ దేవరకొండ ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో పడ్డాడు. చేతిలో వెంటనే షూటింగ్ జరిగే సినిమా లేకుండా పోయింది.ఈ పరిస్థితిని విజయ్ ఎలా ఎదుర్కొంటాడో వేచి చూడాలి.