మెగాస్టార్‌ సినిమాలో విజయ్‌ దేవరకొండ..?

-

మెగాస్టార్ నటించే చిత్రంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా నటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రాన్ని చేస్తున్న చిరంజీవి దీని తర్వాత మలయాళంలో హిట్టయిన ‘లూసిఫర్’ చిత్రంలో నటించనున్నారు. ఈచిత్ర రీమేక్‌ హక్కులను కథానాయకుడు రామ్‌చరణ్‌ సొంతం చేసుకున్నారు. తన తండ్రి చిరంజీవితో ఆ సినిమాను రీమేక్‌ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఇందులో ఓ యంగ్ హీరో చేయాల్సిన పాత్ర కూడా వుంది.

ఆ పాత్రలో మొదట్లో అల్లు అర్జున్ నటిస్తాడంటూ ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదనడంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయట. ఇక అధికారికంగా త్వరలోనే  దీనికి సంబంధించిన ప్రకటన రాబోతుంది. సాహో దర్శకుడు సుజిత్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు.

Read more RELATED
Recommended to you

Latest news