బ్యాంకులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ‌మాల్యా..! అదేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

-

భారత బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్ ‌మాల్యా త్వరలో ఎదుర్కోవాల్సిన శిక్ష నుంచి తప్పించుకునేంకు భారీ ఆఫర్‌ను ప్రకటించాడు. తాను కట్టాలస్సిన మొత్తంలో కేవలం 13,960 కోట్లను చెల్లిస్తానని ప్రతిపాదన చేసాడు. ఈ ప్రతిపాదనను మాల్యా తరపు న్యాయవాది సుప్రీంకోర్టులోకు తెలిపాడు. అయితే రుణాల ఎగవేత కోసుల్లో ఢిల్లీ కోర్టు మాల్యాకు 2016లో నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది.

ఈడీ కేసులో పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ  కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయనకు నాన్‌బెయిలబుల్ వారెంట్‌ జారీ అయ్యింది. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ కంపెనీ కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదని విజయ్ మాల్యాపై ఆరోపణలున్నాయి. పలు బ్యాంకులకు రూ.9వేల కోట్లకుపై రుణాలను ఎగవేసినట్లు ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. అప్పులు, ఆర్థిక కష్టాల్లో కింగ్ ఎయిర్‌లైన్స్ మూతపడిన విషయం తెలిసిందే. అనంతరం విజయ్ మాల్యా 2016 మార్చిలో భారత్ నుంచి బ్రిటన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news