గజదొంగ ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా డ్రామోజీ? అని రామోజీరావుపై విజయ సాయిరెడ్డి సెటైర్ వేశారు. రామూ…ఫిలింసిటీ కొండపైఉన్న నీఇంట్లో బాగోతాలు తెలుసు. ఫిలింసిటీలో ఎన్ని కొండల్ని పిండి చేశావు? చెరువులను పుడ్చావు. 2500 ఎకరాల్లో ఎన్ని ప్రైవేట్, ప్రభుత్వ భూములు ఆక్రమించావు. నీకన్నా గజదొంగ ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా డ్రామోజీ? పెద్దమనిషిలా కనిపించే నీ మోసపు అంతరంగం అందరికీ ఎరుకే అంటూ చురకలు అంటించారు.
1970లో అప్పటి రాష్ట్ర హోంమంత్రి చిట్ ఫండ్ బిల్లును అసెంబ్లీలో పెట్టకముందే రామోజీ తన ప్రయోజనాలకు అనుగుణంగా దానిలో మార్పులు, చేర్పులు చేయించాడు. దీనిని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో చిట్ ఫండ్ వ్యాపారులు, చిన్న బ్యాంకుల ప్రమోటర్లని అరెస్టు చేయించాడు. రాము దుర్మార్గాలకు పరాకాష్ట ఇదని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. నకిలీ కమ్యూనిస్ట్ రాము”ఈనాడు” ఒక క్రూరుడు. ఉద్యోగులని మనుషుల్లా కాకుండా జంతువులుగా భావిస్తాడు. తార్కిక, సహేతుకమైన విమర్శ కూడా భరించలేడన్నారు.
రామూ…ఫిలింసిటీ కొండపైఉన్న నీఇంట్లో బాగోతాలు తెలుసు. ఫిలింసిటీలో ఎన్ని కొండల్ని పిండి చేశావు? చెరువులను పుడ్చావు. 2500 ఎకరాల్లో ఎన్ని ప్రైవేట్, ప్రభుత్వ భూములు ఆక్రమించావు. నీకన్నా గజదొంగ ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా డ్రామోజీ? పెద్దమనిషిలా కనిపించే నీ మోసపు అంతరంగం అందరికీ ఎరుకే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 17, 2022