ఏపీలో కాంగ్రెస్ తో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన విజయసాయిరెడ్డి

-

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికార వైసీపీతో పొత్తు గురించి క్లారిటీ ఇచ్చారు విజయసాయిరెడ్డి.ప్రముఖ ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.ఈ క్రమంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని ఓ ప్రతిపాదన చేశారు.దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు.రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీకి వైసీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.సీఎం జగన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని వెల్లడించారు.తద్వారా వచ్చే ఎన్నికల్లో పొత్తుపై పార్టీ వైఖరి ఎలా ఉంటుందో సూచనప్రాయంగా తెలియజేసారు.

 

అటు వైసీపీలో తనకు పాత పదవి పోయి, కొత్త పదవి లభించడం పట్ల కూడా విజయసాయి వివరణ ఇచ్చారు.ఉత్తరాంధ్ర ఇన్చార్జి బాధ్యతల నుంచి విజయ సాయిని తప్పించిన అధిష్టానం..ఆ స్థానాన్ని వైవి సుబ్బారెడ్డితో భర్తీ చేసింది.విజయసాయిరెడ్డిని వైసీపీ అనుబంధ సంఘాల సమన్వయకర్తగా నియమించింది.దీనిపై విజయసాయి స్పందిస్తూ, పార్టీ ఏ పదవి అప్పగిస్తే ఆ పదవిని నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news