చంద్రబాబు ఓ టెర్రరిస్ట్‌… ఏపీ పరువుతీస్తున్నాడు : విజయసాయిరెడ్డి

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఓ టెర్రరిస్ట్‌ అని.. ఢిల్లీ వెళ్లి ఏపీ పరువు తీస్తున్నాడని నిప్పులు చెరిగారు.

తీవ్రవాద సంస్థ కు రౌడీ మూకలకు ( ఎలిమెంట్స్) చంద్రబాబు నాయకుడని… ఏపి ప్రజలను మోసగించే ప్రయత్నాలను చంద్రబాబు మానుకోవాలని చురకలు అంటించారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితమైన ఆలోచనలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలన్నారు.

చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన గంజాయి వ్యాపారంలో లోకేశ్ కు కూడా వాటాలున్నాయని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మాదక ద్రవ్యాలు, మత్తు మందుల సరఫరా లో ఏపి కి సంబంధం లేదని నార్కోటిక్స్ సంస్థ స్పష్చం చేసిందని నిప్పులు చెరిగారు విజయసాయి రెడ్డి.

చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వ‌చ్చారని… అసాంఘీక శ‌క్తుల‌కు రారాజు చంద్రబాబు అని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు విజయ సాయిరెడ్డి. ఢిల్లీ లో వ్యవ‌స్థల్ని మేనేజ్‌ చేయ‌డానికి వ‌చ్చారా ? ఏపీ ప‌రువు తీశామ‌ని చెప్పుకోవ‌డానికి ఢిల్లీ వ‌చ్చారా? అని ప్రశ్నించారు విజ‌య‌సాయి రెడ్డి.  ఏపీలో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులు లేవని స్పష్టం చేసిన ఆయన… పట్టాభి తిట్లను చంద్రబాబు సమర్థిస్తున్నారా? అనిప్రశ్నించారు.