ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఈ వ్యాయామాలు మంచివి..!

-

ప్రతి ఒక్కరికి ఊపిరితిత్తుల వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో తెలుసు. శరీరంలో ఉండే ఆర్గాన్స్ లో అతి పెద్ద ఆర్గన్ ఊపిరితిత్తులు. మన శరీరంలో ఉండే రక్తానికి ఆక్సిజన్ ను అందిస్తాయి మరియు కార్బన్ డయాక్సైడ్ ని బయటికి పంపిస్తాయి. అయితే ఊపిరితిత్తులని ఆరోగ్యంగా ఉంచాలంటే ఈ వ్యాయమ పద్ధతులని పాటిస్తే మంచిది.

 

కొన్ని బ్రీతింగ్ ఎక్స్ర్సైజులు చేయడం వలన లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. దాంతో మీరు ఫిట్ గా మరియు ఆరోగ్యంగా ఉంటారు. కరోనా మహమ్మారి సమయంలో ఇది పెద్ద సమస్యగా మారింది. ఇక వ్యాయమ పద్దతుల గురించి చూస్తే..

బెల్లి బ్రీతింగ్ :

ఈ ఎక్ససైజ్ ముఖ్యంగా మీ డయాఫ్రం కండరాలను దృఢంగా చేయడానికి. డయాఫ్రం మజిల్ వల్లే ఒక మనిషి ఊపిరి తీసుకోగలుగుతారు. డీప్ బ్రీథింగ్ చేసుకోగలుగుతారు.

ఇక వ్యాయామం ఎలా చెయ్యాలంటే… ముందుగా వెన్నెముకను నెలకు తగిలేలా ఫ్లాట్ గా పడుకోండి. మీ మోకాళ్ళు మరియు మెడ భాగం కింద దిండులను పెట్టండి. మీ చేతిని లేదా తక్కువ బరువు ఉన్న వస్తువుల్ని మీ స్టమక్ పై పెట్టండి. తర్వాత మెల్లిగా ఊపిరి తీసుకోండి ఇలా తీసుకుంటున్నప్పుడు మీ స్టమక్ ఎంత ఎత్తున కదులుతున్నదో పరిశీలించండి. ఆ తర్వాత మీ నోటి ద్వారా శ్వాసని వదిలేయండి.

కార్డియోవాస్క్యులర్ ఎక్సర్సైజెస్ :

జంపింగ్ జాక్, స్క్వాట్ జంప్ మొదలైనవి చెయ్యచ్చు. ఇవన్నీ కూడా మంచిగా శ్వాస తీసుకోడానికి ఉపయోగ పడతాయి.

రిబ్ స్ట్రెచ్ :

రిబ్ స్ట్రెచ్ అంటే మీ రిబ్స్ ను స్ట్రెచ్ చేయడమే. అలా చేస్తే లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. ఈ వ్యాయామం వల్ల మీరు ఎక్కువ ఆక్సిజన్ ను లంగ్స్ లోకి పంపించవచ్చు. ఇలా ఈ పద్ధతులని పాటిస్తే ఊపిరితుత్తులు ఆరోగ్యంగా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news