లోకేష్ ఒక ఆల్కహాలిస్ట్..చంద్రబాబే చెడగొడుతున్నాడు : విజయసాయిరెడ్డి

ఎంపీ విజయ సాయి రెడ్డి షాకింగ్‌ కామెంట్స్ చేశారు. చంద్రబాబు కొడుకు లోకేష్ ఒక ఆల్కహాలిస్ట్, హ్యూమనైజార్ అని… వచ్చే ఎన్నికల్లో లోకేష్ ను సీఎం గా చూడాలని చంద్రబాబు చూస్తున్నాడని మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీ ప్రస్తుతం వెంటీ లేటర్‌ పై ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో లక్షల కోట్లు కొల్లగొట్టాడని… సుమారు రూ. 5 లక్షల కోట్లు అక్రమంగా సంపాదించిన విదేశాల్లో పెట్టాడని సంచలన ఆరోపణలు చేశారు.

అటువంటి దుర్మార్గులను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో విశ్వశించరని.. మా నాయకుడు మీద నోటికొచ్చినట్లు విమర్శిస్తే ఎట్టి పరిస్థితి ల్లో ఊరుకునేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు ప్రవాసాంధ్రుడుగా హైదరాబాద్ లో ఉండి రాజకీయాలు నడుపుతున్నాడని… నాయకుడికి విశ్వసనీయత, ప్రజామోదం ఉండాలన్నారు. ఈ నాయకత్వ లక్షణాలు లేని 14ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు అని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు తనతో పాటు కొడుకుని చెడ గొడుతున్నాడని.. టీడీపీకి భవిష్యత్తు లేదని తేల్చి చెప్పారు ఎంపీ విజయ సాయిరెడ్డి.