త్వరలోనే తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయబోతున్నాం : విజయశాంతి

-

త్వరలోనే తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయబోతున్నామని విజయశాంతి ప్రకటించారు. కేసీఆర్‌కి ఐదు రాష్ట్రాల ప్ర‌జ‌లు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చారని… దేశానికి పీఎం కావాల‌నుకుంటున్న కేసీఆర్ ఆశ‌ల‌కు ఈ ఫ‌లితాలు గండి కొట్టాయని చురకలు అంటించారు రాములమ్మ. ఐదు రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో నాలుగు చోట్ల బీజేపీ కాషాయ జెండాను ఎగ‌రేసింది. దీంతో కేసీఆర్​ ఫ్రంట్ ముందుకా, వెనక్కా అన్నట్లు త‌యారైంది. దేశంలో బీజేపీ, కాంగ్రెస్​లకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలతో ఫ్రంట్​ ఏర్పాటు చేయాలనుకుంటున్న కేసీఆర్​కు ఈ ఫలితాలు చాచి కొట్టినట్టైందన్నారు.

ఐదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల బీజేపీ, మరోచోట ఆప్​ విజయం సాధించాయి. దీంతో ఫ్రంట్​ స్పీడ్​కు బ్రేకులు ప‌డ్డాయి. చాన్స్​ దొరికితే నేషనల్​ పాలిటిక్స్​లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్న కేసీఆర్… ఇటీవల ప్రధాని మోడీగారి పైనే రాజకీయ యుద్ధం ప్రకటించారని ఎద్దేవా చేశారు. తనే స్వయంగా ఇతర రాష్ట్రాల సీఎంలు, ప్రాంతీయ పార్టీల నేతల దగ్గరికి వెళ్లి ఫ్రంట్​ ఏర్పాటుకు సహకారం కోరారు. ఇందులో భాగంగానే తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి అక్కడి సీఎంలను, ఇతర నేతలను కలిసి వచ్చారని వివరించారు. ఈ భేటీలకు ఆశించిన స్పందన రాకపోగా… ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుకు చర్యలు ముమ్మరం చేయ‌ల‌ని క‌ల‌లు క‌న్నాడు. ఈ ఎన్నికల్లో బీజేపీ దెబ్బ తింటుందని, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్​వాదీ పార్టీ పుంజుకుంటుందనే ధీమాతో గులాబీ బాస్ ఉన్నాడు. కానీ ఫలితాలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉండటం… పంజాబ్​లో గెలిచిన ఆప్​తో కూడా టీఆర్​ఎస్​కు సఖ్యత లేక‌పోవ‌డంతో కేసీఆర్ ఆశల మీద నీళ్ళు చల్లినట్టైందని విమర్శలు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news