రాహుల్‌ గాంధీకి ఇంగిత జ్ఞానమే లేదు – విజయశాంతి

-

 

రాహుల్‌ గాంధీకి ఇంగిత జ్ఞానమే లేదని విమర్శలు చేశారు విజయశాంతి. దేశం కోసం కఠిన కాలాపానీ జైలులో క్రూరాతి క్రూర శిక్షలకు గురైన మహనీయుడు వినాయక్ దామోదర్ సావర్కర్ గారిని నిందిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు పదే పదే విమర్శిస్తూ పొరపాటు చేస్తున్నరు. సావర్కార్ గారు నాడు బ్రిటిష్ అధికారులకు ఇచ్చిన లేఖలో వాడిన పదజాలం గురించి రాహుల్ మాట్లాడారని మండిపడ్డారు.

అదే పదజాలాన్ని ఆనాడు బ్రిటిషర్ల ద్వారా జైలుపాలైన ఎందరో నేతలు… గాంధీజీ, నెహ్రూజీ సహా చాలామందే తమ లేఖల్లో ఉపయోగించిన రుజువులు ఇప్పటికే బయటకొచ్చాయి. అంతేకాదు, సావర్కర్ గారిని రాహుల్ నానమ్మ, దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీగారు ఎంతగా అభిమానించారో రాహుల్ గారికి తెలియకపోవడం ఎంతో విచారకరమన్నారు.

ఇందిరా గాంధీగారే సావర్కర్ గారి స్టాంప్ విడుదల చేయించారు, ముంబైలో సావర్కార్ స్మారకం కోసం వ్యక్తిగతంగా రూ.11 వేలు విరాళం ఇచ్చారు. సావర్కార్ గారి జన్మస్థలాన్ని సైతం ఇందిర సందర్శించారు. కాంగ్రెస్ నేతలు ఒక్కసారైనా సావర్కర్ గారి జీవితచరిత్ర చదివితే ఈ నిజాలు తెలుస్తాయి. రాహుల్ గారు చేపట్టిన భారత్ జోడో యాత్ర కేవలం ఇలాంటి విషప్రచారం కోసమేనేమో అనిపించేలా ఉండటం సమంజసం కాదని ఆగ్రహించారు విజయశాంతి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news