బంగ్లాదేశ్ లో గత కొద్ది రోజుల నుంచి అల్లర్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హసీనా ప్రధాని పదవీ నుంచి తప్పుకున్న రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ ఘటన పై విజయశాంతి ట్విట్టర్ వేధికగా స్పందించారు. హిందువులు, హిందువుల ఆస్తులు, ఆలయాలను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఘోరాల వీడియోలు చూసి ఎవ్వరైనా తల్లడిల్లే పరిస్తితులు అన్నారు. మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరూ ఖండించాలని పేర్కొన్నారు.
అదే సమయంలో అక్కడ కేవలం హిందువులనే కాక మాజీ ప్రధాని హసీనా పార్టీ అవామీ లీగ్ కు చెందిన చాలా మంది హత్యకు గురయ్యారని తెలిపారు. వారి ఇళ్లు, వ్యాపార సంస్థలు కూడా విధ్వంసానికి గురయ్యాయని, నటుడు నిర్మాత అయిన ఇద్దరూ తండ్రి కొడుకులు కూడా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ముస్లింలే.. ఎవరెవరిపైనో ఎవరెవరికో ఉన్న పాత కక్షలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి రాజకీయ ప్రత్యర్థులు ఇంకెందరో తమ ఆగ్రహావేశాలు ప్రదర్శించేందుకు ఉపయోగించుకున్నారని తెలిపారు.