ఇజ్రాయిల్ తో ఉద్రిక్తత మధ్య ఇరాన్ కి చైనా మద్దతు..!

-

హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఇరాన్ గడ్డపైనే హత్యకు గురికావడంతో ఆ దేశం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారం కోసం వచ్చిన సమయంలో రాజధాని టెహ్రాన్ లో హనియే హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు ఇజ్రాయిల్ బాధ్యత వహించినప్పటికీ.. ఇరాన్ మాత్రం ఇది ఇజ్రాయిల్ పనే అని దీనికి ప్రతీకారం తప్పకుండా ఉంటుందని హెచ్చరించింది. ఇజ్రాయిల్ పై దాడికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశించినట్టుగా వార్తలు వినిపించాయి.

తాజాగా ఈ సంక్షోభ సమయంలో ఇరాన్ కి చైనా మద్దతుగా నిలిచింది. ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రత జాతీయ గౌరవాన్ని కాపాడుకోవడంలో చైనా మద్దతు ఇస్తుందని చైనా విదేశాంగ మంత్రికి ఫోన్ కాల్ లో తెలియజేసినట్టు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యను బీజింగ్ ఖండించింది. ఈ దాడి ఇరాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించిందని, ప్రాంతీయ స్తిరత్వాన్ని దెబ్బతీసిందని వాంగ్ యీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news