33లక్షలు హ్యాక్.. రికవర్ చేసిన విజయవాడ పోలీసులు..

-

సైబర్ క్రైమ్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. ఆన్ లైన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పెరిగిన తర్వాత హ్యాకర్లు చెలరేగిపోతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం, పోలీసులు అవగాహన కార్యక్రమాలు జరుపుతున్నా ఎక్కడో ఓ చోట మోసపోతూనే ఉన్నారు. తాజాగా హ్యాకర్ల చేతిలో బలైపోయిన కంపెనీ ఒకటి బయటకి వచ్చింది. కమ్యూనిటీ నెట్ వర్క్ సెంటర్ అనే ప్రైవేటు సంస్థ 33లక్షలు పోగొట్టుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న ఈ సంస్థ అమెరికాలో ఉన్న హార్మోనిక్స్ ఇంటర్నేషనల్ కంపెనీతో లావాదేవీలు జరిపింది.

ఈ లావాదేవీలన్నీ మెయిల్ ద్వారా జరిగాయి. ఐతే కొన్ని రోజుల తర్వాత కమ్యూనిటీ నెట్ వర్క్ సెంటర్ సంస్థ, తాను జరిపిన లావాదేవీలు యూఎస్ బేస్డ్ కంపెనీతో కాదని తెలిసొచ్చింది. ఫేక్ మెయిల్ ఐడీ ద్వారా తాము మోసపోయామని గుర్తించి వెంటనే విజయవాడ పోలీసులని ఆశ్రయించింది. రంగంలోకి దిగిన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు హ్యాకర్ల జాడ పట్టుకుని 33లక్షలని రికవరీ చేయగలిగారు.

ఈ 33లక్షల రూపాయలు యూకే లో ఉన్న ఒకానొక బ్రాంచ్ లో ఉన్నాయని గుర్తించి, ఆ బ్యాంకు వారిని కాంటాక్ట్ చేసి వాటిని మళ్లీ వెనక్కి రప్పించగలిగారు. ఆ తర్వాత అమెరికా బేస్డ్ కంపనీ అయిన హార్మోనిక్స్ ఇంటర్నేషనల్ కి రిక్వెస్ట్ పంపారు. తమ కంపెనీ పేరు చెప్పి ఇలా ఫేక్ ఐడీలతో మోసం జరుగుతుందని, ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండమని, ఇలాంటివి మునుముందు జరగకుండా జాగ్రత్తపడాలని సూచించింది. ఏదేమైనా కంపెనీలే ఇటువంటి విషయాల్లో మోసపోతుంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటో..!

Read more RELATED
Recommended to you

Latest news