సంక్రాంతి కానుకగా వచ్చిన మాస్టర్ సినిమామి ప్రేక్షకుల స్పందన బాగానే ఉంది. దళపతి విజయ్ నటించిన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్లు బాగానే ఉన్నాయి. తమిళనాట కలెక్షన్ల రికార్డులు కొల్లగొడుతున్న ఈ చిత్రం ఇంకా థియేటర్లలో రన్ అవుతూనే ఉంది. ఐతే తాజా సమాచారం ప్రకారం విజయ్ అభిమానులకి ఎదురుదెబ్బ తగలనుంది. మాస్టర్ సినిమా డిజిటల్ హక్కులు ఇప్పటికే అమ్ముడైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8వ తేదీ నుండి అమెజాన్ లో స్ట్రీమింగ్ అవనుందని ఇంతకుముందు వార్తలు వచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం మాస్టర్ సినిమా డిజిటల్ ప్రేక్షకులకి జనవరి 29వ తేదీ నుండే అందుబాటులో ఉండనుందట. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ తన నిర్ణయాన్ని మార్చుకుందని వినిపిస్తుంది. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న మాస్టర్ సినిమా ఇంత తొందరగా డిజిటల్ లోకి రావడం విచారించదగ్గ అంశమే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు.