రైల్వే మంత్రికి వినోద్ కుమార్ లేఖ

-

రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న 3.12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కు ఆయన లేఖ రాశారు. దక్షిణ మధ్య రైల్వేలోనే 30వేల ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఉద్యోగ ఖాళీల వల్ల సిబ్బందికి పని ఒత్తిడి పెరుగుతోందన్నారు. పర్యవేక్షణ లోపం ప్రమాదాలకు దారి తీస్తోందని వినోద్ కుమార్ లేఖ ద్వారా మంత్రికి వివరించారు.

BJP doesn't hold patent of Patriotism: Telangana planning board VC Vinod  Kumar

సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో టికెట్ కలెక్టర్స్, స్టేషన్ మాస్టర్స్, లోకో మోటివ్ పైలట్స్, ట్రాక్ మెంటేనర్స్, టెక్నికల్ స్టాఫ్, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. నిరంతరంగా రైల్వే ట్రాక్స్ ను, సిగ్నల్స్ లైటింగ్స్ ను పర్యవేక్షణ చేసేందుకు తగిన స్థాయిలో సిబ్బంది లేని కారణంగా ప్రమాదాలకు చోటు కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలీచాలని ఉద్యోగులు ఉన్న ప్రస్తుత తరుణంలో, ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతుండటంతో మానసికంగా కృంగి పోతున్నారని తెలిపారు. రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నిరంతరం వృత్తి శిక్షణ శిబిరాలు నిర్వహించాలని, ఉద్యోగులకు ఇన్సెంటివ్ లు ఇచ్చి ప్రోత్సహించాలని, రైలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news