వైరల్ ఫోటో; మాటలకు అందని దారుణం…!

-

ఆస్ట్రేలియాలో గత కొన్ని నెలలుగా బుష్ఫైర్ ఆ దేశాన్ని దహించి వేసింది, భారీ స్థాయిలో వన్యప్రాణులు మంటల్లో సజీవ దహనం అయిపోయాయి. గాలిని కలుషితం చేయడంతో పాటుగా లక్షల ఎకరాల అడవులను నాశనం చేసింది. రికార్డ్ స్థాయిలో వేడి మరియు బలమైన గాలులు దేశవ్యాప్తంగా భయంకరమైన వేగంతో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం ఆ దేశంలో కొనసాగుతున్న కార్చిచ్చు,

ఇప్పటికే 480 మిలియన్లకు పైగా జంతువులను బలి తీసుకుంది. విపత్తు నుండి అనేక హృదయ విదారక చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూస్తే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధమవుతుంది. ఒక ఫోటోలో మంటల దాటి నుంచి బయటపడటానికి ఒక కంగారు జంతువు ఫెన్సింగ్ దాటుకుని వచ్చే ప్రయత్నంలో మంటల్లో కాలిపోతుంది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక మరికొన్ని ఫోటోలలో అడవి గొర్రెలు మంటల ధాటికి వాటి శరీరంపై ఉన్న జుట్టు కాలిపోయింది. ఇక వేలాది అడవి గేదెలు, గుర్రాలు భారీగా ఈ మంటల్లో కాలిపోయాయి. చిన్న చిన్న జీవులు మంటల నుంచి తప్పించుకోలేక కాలిపోయాయి. భారీ జంతువులు మంటల్లో కాలిపోయిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ వర్షాలు పడుతున్నాయని కొన్ని రాష్టాల్లో మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు చెప్తున్నారు. విక్టోరియా రాష్ట్రంలో మాత్రం తీవ్రంగా ఉన్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news