వైరల్ ఫోటో: ఆ సినిమాను చూసి కంటతడి పెట్టుకున్న కర్ణాటక సీఎం

-

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై 777 చార్లీ సినిమాను చూసి కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంగళవారం 777 చార్లీ సినిమాను వీక్షించిన కర్ణాటక సీఎం.. ఆ సినిమాను చూస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. పెంపుడు కుక్కతో ఒక వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని ఈ సినిమాలో కన్నులకు కట్టినట్లు చూపించారు. దీంతో కర్ణాటక సీఎం చనిపోయిన తన పెంపుడు కుక్కను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై

సినిమా చూసిన అనంతరం సీఎం బసవరాజు బొమ్మై మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో కుక్కలపై చాలా సినిమాలు వచ్చి ఉంటాయి. కానీ, 777 చార్లీ సినిమా అన్ని సినిమాకు భిన్నంగా చిత్రీకరించారు. ఈ సినిమాలో జంతువులతో మనుషులకు మధ్య ఉన్న అనుబంధం, భావోద్వేగాన్ని చాలా గొప్పగా చూపించారు. ఇందులో కుక్క తన భావోద్వేగాలను తన కన్నులతో వ్యక్తపరుస్తుంది. ఎలాంటి స్వార్థం లేని, స్వచ్ఛమైన ప్రేమ కుక్కలది.  ఈ సినిమా చాలా బాగుంది. చనిపోయిన నా పెంపుడు కుక్కను గుర్తు చేసింది. వీలైతే అందరూ తప్పకుండా సినిమా చూడండి.’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news