వైరల్ పిక్; బూమ్రా పోస్ట్ చేసిన ఫోటో చూసారా…?

-

లాక్ డౌన్ సమయంలో ప్రేక్షకులను అలరించడానికి క్రికెటర్లు, సినీ నటులు ఇలా ప్రతీ ఒక్కరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను వాళ్ళు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ అలరిస్తున్నారు. వీడియో లు ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బూమ్రా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసాడు.

ట్విట్టర్ పోస్ట్‌లో తన బాల్యానికి సంబంధించిన ఫోటోని పోస్ట్ చేసాడు. ఈ ఫోటోలో బూమ్రా… నీట్ గా రెడీ అయి.. చేత్తో ఒక బోకే పట్టుకున్నాడు. “చిన్న క్షణాలు, పెద్ద జ్ఞాపకాలు” అని క్యాప్షన్ పెట్టాడు. ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ప్రస్తుతం బూమ్రా వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్ళు గా టీం ఇండియా కు కీలక బౌలర్ గా మారిపోయాడు బూమ్రా.

మూడు ఫార్మాట్లలో దేశానికి రెగ్యులర్ బౌలర్ అయ్యాడు. అయితే ఇటీవల జరిగిన న్యూజిలాండ్ తో సీరీస్ లో అతను పేలవ ప్రదర్శన చేసాడు. అక్కడి నుంచి బూమ్రా ఫాం పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను కేవలం భారత మైదానాల్లో మాత్రమే ఆకట్టుకుంటాడు అంటూ కామెంట్స్ వచ్చాయి. ముంబై ఇండియన్స్ తరుపున ఐపిఎల్ లో ఆడుతున్నాడు బూమ్రా.

Read more RELATED
Recommended to you

Latest news