మెగాస్టార్ చిరంజీవి కి రౌడి అల్లుడు సినిమా ఎంతటి పేరు తెచ్చిందో అందరికీ తెలిసిందే. డ్యూయల్ రోల్ లో చిరంజీవి అదరగొట్టారు. కళ్యాణ్ గా, ఆటో జానీ గా మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. అంతేకాదు మెగాస్టార్ నటించిన సూపర్ హిట్ చిత్రాల లిస్ట్ లో టాప్ టెన్ లో రౌడి అల్లుడు నిలుస్తుంది. అయితే అందులో ఆటో జాని పాత్ర మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఇదే టైటిల్ తో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పురి జగన్నాధ్ చిరంజీవి తో రీ ఎంట్రీ మూవీ తెరకెక్కించాలని ప్లాన్ చేశారు.
సరిగ్గా వారం రోజుల్లో కథ రాసుకొని చిరంజీవి, నాగ బాబులకు వినిపించారు. ఇద్దరికి నచ్చినప్పటికి కథలో సెకండాఫ్ చిరంజీవి కి అంతగా నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే అప్పటి నుంచి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందన్న ఆశతోనే ఉన్నారు. ఇక పూరి జగనాధ్ కైతే మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎపుడొస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పూరి ఇప్పటికే పవన్ కళ్యాన్ తో తీసిన బద్రి విజయవంతం గా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అంతేకాదు పూరి ఇండస్ట్రీకొచ్చి సక్సస్ ఫుల్ గా 20 ఏళ్ళు కంప్లీటయింది.
ఈ 20ఏళ్ళలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు పూరి. కాని ఆయనకున్న ఒకే ఒక్క డ్రీం మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయాలని. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా కేటగిరీలోనే నిర్మిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమా తో పాటు చిరంజీవి కొంతమంది యంగ్ డైరెక్టర్స్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆచార్య సినిమా తర్వాత లూసీఫర్ రీమేక్ చేయనున్నారు మెగాస్టార్. ఈ సినిమాకి సుజీత్ దర్శకత్వం వహించనున్నాడు. సాహో లాంటి పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సుజీత్ కి మెగాస్టార్ సినిమా మూడోది మాత్రమే. ఇక నెక్స్ట్ సినిమా బాబి దర్శకత్వంలో ఉండనుందట. బాబి చెప్పిన కథ కూడా చిరంజీవి కి బాగా నచ్చిందని దాదాపు ఇదే నెక్స్ట్ ప్రాజెక్ట్ అని అంటున్నారు.
ఇక మెగాస్టార్ అనుకుంటున్న యంగ్ డైరెక్టర్స్ జాబితాలో హరీష్ శంకర్, పరశురాం, సుకుమార్, మెహర్ రమేష్ ..ఇలా లిస్ట్ చాలా పెద్దదే ఉంది. కాని చిరంజీవి అనుకుంటున్న లిస్ట్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ లేకపోవడం. ఈ మధ్య చెప్పిన పేర్లలో కూడా చిరంజీవి పూరి జగన్నాధ్ పేరు ప్రస్తావించకపోవడం అందరికీ షాకింగ్ గా ఉంది. కాని పూరి జగన్నాధ్ అందరికంటే స్పీడ్ గా సినిమా తీస్తారు కాబట్టే చిరంజీవి అనుకున్నప్పుడు పూరి తో చేస్తారని అది అప్పటికప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టే ఇప్పుడు పూరి పేరు ప్రస్తావనకి తీసుకు రాలేదని అంటున్నారు. అనుకుంటే పూరి మూడు నుంచి నాలుగు నెలల్లో సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారు. అందుకే అనుకోని కారణాల వల్ల ఎక్కువ గ్యాప్ వస్తే వెంటనే పూరికి అవకాశం ఇవాలని చూస్తున్నారని చెప్పుకుంటున్నారు. అదెప్పుడన్నది మాతం సస్పెన్స్ గా ఉంచారు.