సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత జనాల్లో ఉన్న సృజనాత్మకత అనేది బయట పడుతుంది. ఇన్నాళ్ళు తమ ప్రతిభను ఎవరైనా తోక్కేసారు అనుకున్నారో ఏమో తెలియదు గాని కొంత మంది మాత్రం సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కువగా హడావుడి చేస్తున్నారు. అసభ్యంగా ఉన్నా అభ్యంతరకరంగా ఉన్నా సరే వాళ్ళు ఎక్కువగా హడావుడి చేస్తున్నారు. ఇక కొన్ని టీవీ సీరియల్స్ లో నటులు కూడా ఈ ఏడాది బాగానే వైరల్ అయ్యారు… తెలుగులో ఇది ఎక్కువగా జరిగిందనే చెప్పుకోవచ్చు.
కార్తీక దీపం సీరియల్ లో దీప పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాథ్… వంటల అక్కగా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయింది. ఆమె మిమీస్ ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. ఆమె ఫోటో కూడా ఎక్కువగానే చక్కర్లు కొట్టింది. జనసేన పార్టీకి చెందిన ఒక ఉత్తరాంధ్ర లీడర్… పవన్ ప్రసంగం సందర్భంగా పెట్టిన హావభావాలు కూడా ఈ ఏడాది బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ ని వదిలేసి వైసీపీలో జాయిన్ అయ్యారు. విశాఖలో పవన్ లాంగ్ మార్చ్ చేయగా అక్కడ దర్శనం ఇవ్వడం హాట్ టాపిక్ అయింది.
ఇక భిన్నంగా కనిపిస్తే వైరల్ అవుతాను అని భావించిన ఉప్పల బాలు కూడా ఈ ఏడాది ఎక్కువగా తెలుగు సోషల్ మీడియాలో సందడి చేసాడు. అతని పాట ఒకటి వివాదాస్పదంగా మారింది. అలాగే కాగజ్ నగర్ సాయి అనే వ్యక్తి కూడా సోషల్ మీడియాలో సందడి చేసాడు. నెల్లూరుకి చెందిన మచ్చ కిరణ్ అనే వ్యక్తి కూడా ఈ ఏడాది వైరల్ అయ్యాడు. అతని తో అక్కడ ఉన్న స్థానిక యువకులు కొందరు చేసిన వీడియోలు ఎక్కువగా పాపులర్ అయ్యాయి. అలాగే… బిగ్ బాస్ లో కనిపించిన రాహుల్, పునర్నవి ఎక్కువగా ఈ ఏడాది సోషల్ మీడియాలో నిలిచారు.