టేకాఫ్ సమయంలో ఎయిర్ కెనడా విమానం ల్యాండింగ్ వీల్ ఊడిపోతున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. విమానం యొక్క చక్రాలపై దృష్టి పెట్టిన ఈ వీడియోలో, చిన్న స్పార్క్ వచ్చి మరియు చక్రం నుండి చిన్న మంటలు వస్తున్నాయి. ఆ తరువాత విమానం రన్వే నుండి పైకి ఎగిరినప్పుడు చక్రం ఊడి పడిపోయింది.
ట్విట్టర్ యూజర్, కాఫ్ వీడియోను పోస్ట్ చేస్తూ ” నేను ప్రస్తుతం ఒక చక్రం కోల్పోయిన విమానంలో ఉన్నాను … 2020 చాలా బాగా మొదలవుతుంది” అనే శీర్షికతో వీడియోను పోస్ట్ చేసారు. అంతర్జాతీయ మీడియా ప్రకారం ఈ సంఘటన జరిగినప్పుడు డాష్ 8-300 మాంట్రియల్ నుండి కెనడాలోని బాగోట్విల్లేకు బయలుదేరింది. చక్రం పడిపోయిన వెంటనే, విమానాన్ని రద్దు చేసారు. ఆ తరువాత పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేయడానికి,
ముందు ఇంధనాన్ని కాల్చడానికి గాను కాసేపు చక్కర్లు కొట్టాడు. వీడియోను ఇంటర్నెట్‌లో షేర్ చేసిన తరువాత, నెటిజన్లు పైలట్‌లను సురక్షితంగా ల్యాండింగ్ చేసినందుకు ప్రశంసించారు. ఎయిర్ కెనడా కథనం ప్రకారం, విమానంలో ఉన్న సిబ్బందితో సహా 52 మందిలో, ఎవరూ గాయపడలేదు. “విమానంలో ఆరు టైర్లు ఉన్నాయి మరియు మా పైలట్లు అటువంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి బాగా శిక్షణ పొందారు మరియు మా ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల ప్రకారం స్పందించారు” అని అధికారులు తెలిపారు.
Bon bah là j’suis actuellement dans un avion qui vient de perdre une roue…
2020 commence plutôt bien ? pic.twitter.com/eZhbOJqIQr— Tom (@caf_tom) January 3, 2020